News October 16, 2024
గుడివాడలో అమలులోకి డిప్యూటీ సీఎం ఆదేశాలు
డిప్యూటీ CM పవన్ ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి కాలుష్య సమస్య పరిష్కారానికి అధికారులు నడుం బిగించారు. తాగునీటి నమూనాల సేకరణకు 44మంది ఇంజినీరింగ్ సహాయకులతో 6 బృందాలను ఏర్పాటు చేయగా ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి నీటి నమూనాలు సేకరిస్తున్నాయి. 43 గ్రామాల్లో తాగునీరు కలుషితమైందని MLA వెనిగండ్ల రాము కంకిపాడులో జరిగిన పల్లె పండుగ సభలో పవన్ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News November 5, 2024
బాలికపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
కోడూరు మండలంలో కీచక టీచర్ మూడో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుచున్నారు. బాలికపై జరిగిన ఈ దారుణం పాప తమకు చెప్పడానికే భయపడిందని, అంతలా భయపెట్టాడని వాపోయారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో టీచర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత ఐదు నెలల్లో కోడూరు మండలంలో ఇలాంటి ఘటనలు నాలుగు చోటు చేసుకోవడం, ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్ కావడం గమనార్హం.
News November 5, 2024
రక్షణ కల్పించండి: విజయవాడలో ప్రేమజంట
ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని సరిధే భూమికశ్రీ కోరారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్‌కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్‌తో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న తమ తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.
News November 4, 2024
కృష్ణా: ఇన్‌ఛార్జ్ మంత్రి సుభాష్‌తో భేటీ అయిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సుభాష్ వాసంశెట్టితో సోమవారం కలెక్టర్ DK బాలాజీ, ఎస్పీ ఆర్.గంగాధర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మచిలీపట్నం ఆర్అండ్‌బీ అతిథిగృహంలో ఈ భేటీ జరిగింది. ఈ మేరకు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పలు పథకాలు, కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి కలెక్టర్ DK బాలాజీ, మంత్రి సుభాష్‌కు వివరించారు.