News March 9, 2025

గుడివాడ: ఉత్తమ వార్డు అందుకున్న శక్తి టీమ్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ శక్తి టీమ్ విద్యార్థులు, మహిళల భరత్ భద్రతపై శ్రమిస్తున్నందుకుగాను.. వారి సేవలను గుర్తించి కలెక్టర్ డీకే బాలాజీ శనివారం అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా శక్తి టీమ్ సిబ్బందికి పోలీస్ అధికారులు, పట్టణ ప్రజలు, పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Similar News

News February 12, 2026

కృష్ణా: పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్.. ఏఆర్ సిబ్బందికి శిక్షణ

image

ఏఆర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్‌లో భాగంగా మంగినపూడి బీచ్ వద్ద గల ఫైరింగ్ రేంజ్‌లో గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ గురిని పరీక్షించుకున్నారు. విధి నిర్వహణలో ఆయుధాల వినియోగంపై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

News February 12, 2026

రాష్ట్ర సెక్రటేరియట్‌లో కృష్ణా జిల్లా ప్రణాళికలపై చర్చ

image

కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.

News February 12, 2026

నేడు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

image

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొల్లు రవీంద్ర, బుద్ధప్రసాద్, బోడె ప్రసాద్, వెంకట్రావు, రాము, కృష్ణప్రసాద్, కుమార్‌ రాజా పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన ప్రాధాన్య ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.