News January 27, 2025

గుడివాడ: గవర్నర్ నజీర్‌ను కలిసిన ఎమ్మెల్యే రాము

image

76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్ నజీర్ ఎమ్మెల్యే రాముతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .

Similar News

News January 30, 2025

పీహెచ్సీలలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కృష్ణా కలెక్టర్

image

జిల్లాలోని పీహెచ్సీలలో మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. పీహెచ్సీలలో వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన, సమస్యలపై బుధవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యాధికారులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు.

News January 30, 2025

పెనమలూరు: ఒడిశా నుంచి గంజాయి సరఫరా

image

గంజాయి అమ్ముతున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. మణికంఠ, పూజిత భార్యాభర్తలు ఒడిశా నుంచి గంజాయిని కానూరులోకి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నారు. మంగళవారం రాత్రి కామయ్యతోపు వద్ద వాహనాలు తనిఖీలో పోలీసులకు దొరికారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.

News January 30, 2025

ఎమ్మెల్సీ ఎన్నికకు సహకరించాలి: కలెక్టర్

image

కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కోడ్ అమలుకు సహకరించడంతోపాటు శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.