News March 23, 2024
గుడివాడ: గుంతలో పడి వ్యక్తి మృతి

గుడివాడలో పామర్రు- కత్తిపూడి జాతీయ రహదారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రహదారి గుంతలో పడి టెంట్ హౌస్ కూలి కాటూరి స్వామి(54)అనే వ్యక్తి మృతిచెందాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయిందని, రోడ్డుపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. జీవనాధారం కోల్పోయిన తమను ఆదుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
MTM: పేరెంట్స్, టీచర్స్ మీటింగ్పై కలెక్టర్ సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోనశశిధర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్స్ సమావేశంపై వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. సమావేశంలో విద్యార్థుల పురోగతిపై చర్చించారు.
News November 27, 2025
కృష్ణా: త్వరలో సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టుల భర్తీ

కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె. బాలాజి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల పనుల పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించారని కలెక్టర్ వివరించారు.
News November 27, 2025
కృష్ణా: రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు..!

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి కృష్ణా జిల్లా రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర హామీ నీటిపై రాతయ్యిందని అంటున్నారు. ఇక్కడి మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో, గోదావరి జిల్లాల మిల్లర్లు 28% తేమ ఉన్న ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.


