News April 24, 2025
గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్‌కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News April 24, 2025
PSL ప్రసారంపై నిషేధం

మన దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్‌గామ్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్‌లో PSLను స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్ లైవ్ ఇస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇవాళ్టి నుంచి PSL ప్రసారం ఆగిపోనుంది. భారత్ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోదని ఇప్పటికే BCCI ప్రకటించిన విషయం తెలిసిందే.
News April 24, 2025
మాచవరం: ఈతకు వెళ్లి ఇద్దరి విద్యార్థుల మృతి

మాచవరం మండలం కొత్తపాలెంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఏఎస్ఐ విజయ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపాలెం ఎస్సీ కాలనీకి చెందిన యేసు రాజు(16), జస్వంత్(9) మరణించారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో ఈత కొట్టేందుకు బావిలోకి దిగారు. సరిగ్గా ఈత రాకపోవడంతో ఆ ఇద్దరు చనిపోయారు. వీరి మృతితో కొత్తపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News April 24, 2025
అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం: కలెక్టర్

గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు. కలెక్టరేట్‌లో గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.