News November 20, 2024

గుడివాడ: సజ్జల భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిపై గుడివాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. అనంతరం ఈ పిటిషన్‌ను ఎల్లుండి నవంబర్ 22వ తేదికి హైకోర్టు వాయిదా వేసింది. 

Similar News

News December 11, 2024

కృష్ణా: పీజీ (రెగ్యులర్ )పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పీజీ కోర్సు 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

News December 11, 2024

విజయవాడ: వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డికి షాక్

image

తనపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత పూనురు గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి హత్యకు గౌతమ్ రెడ్డి కుట్ర పన్నారని, ఘటనకు సంబంధించిన CC ఫుటేజ్, ఫోటోలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ కేసు వాదనలో భాగంగా గతంలోనే న్యాయస్థానానికి విన్నవించారు. 

News December 11, 2024

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 22 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డా. గీతాబాయి తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 16లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.