News January 4, 2025
గుడివాడ: CRPF జవాన్ మృతి..కన్నీటి ఎదురుచూపులు
అరుణాచలప్రదేశ్‌లో సీఆర్పిఎఫ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గుడివాడకు చెందిన కర్ర రామకృష్ణ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. భౌతిక కాయం రావడానికి మరొక రోజు ఆలస్యం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు రావలసిన భౌతికకాయం వాతావరణం అనుకూలించక ఫ్లైట్ రద్దు అవ్వడంతో ఆలస్యమైందన్నారు. 5వ తేదీ బంటుమిల్లిరోడ్డులోని ఆయన నివాసం వద్దకు తీసుకురానున్నట్లు తెలిపారు.
Similar News
News January 8, 2025
కూచిపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మొవ్వ మండలం కూచిపూడి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయ్యంకి అడ్డరోడ్డు వద్ద మోటార్ సైకిల్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న అయ్యంకి గ్రామానికి చెందిన నాగరాజు(39), పెద్ద మునేశ్వరరావు (60) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 8, 2025
కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీ-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28,30, ఫిబ్రవరి 1,3 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News January 8, 2025
కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్
పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పెడన కలంకారీ ఆర్టిజాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్‌ను కలిసి పెడనలో ఏర్పాటు చేయనున్న కలంకారీ క్లస్టర్ గురించి చర్చించారు.