News November 10, 2024
గుడిసె కృష్ణమ్మకు నిరాశ
సీఎం చంద్రబాబు ప్రకటించిన నామినేటెడ్ పదవుల రెండో విడత జాబితాలోనూ ఆదోనికి చెందిన టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మకు పదవి వరించలేదు. నామినేటెడ్ పదవి దక్కుందని భావించిన కృష్ణమ్మకు మరోసారి నిరాశే మిగిలింది. మంత్రి లోకేశ్ గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో కృష్ణమ్మకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని ఆమె వర్గం ఆశిస్తోంది.
Similar News
News December 8, 2024
బనగానపల్లెలో టీచర్‌పై కేసు
ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌ను తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బనగానపల్లెలో శనివారం జరిగింది. మ్యాథ్స్ టీచర్ ధృవకుమార్ విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేస్తానని ఓ విద్యార్థిని వద్ద డబ్బు వసూలు చేసినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. అయితే దాంతో పాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసి పేరెంట్స్ చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
News December 8, 2024
విద్యార్థులకు శ్లోక రూపంలో అవగాహన కల్పించిన కలెక్టర్
పిల్లల భవిష్యత్తు గుర్తించి పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తల్లితండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. బేతంచెర్ల మండలం RS రంగాపురం ZPH స్కూల్లో మాట్లాడుతూ.. సమాజంలో గౌరవింపబడాలంటే 5వ కారాలతో కూడిన ప్రవర్తన ఉండాలన్నారు. వస్త్రేనా వపుషా వాచా విద్య యా వినయైన చవ కారైహి పంచ బి ర్యుక్తఃన రో భవతి పండితః అని శ్లోక రూపంలో వివరించి భావం తెలిపారు.
News December 7, 2024
కర్నూలు జిల్లాలో ‘నో డ్రగ్స్ బ్రో’ క్యాంపెయిన్
కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శుక్రవారం ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత స్ఫూర్తితో ‘నో డ్రగ్స్ బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదోని మండలం దొడ్డనకేరి మోడల్ ప్రైమరీ స్కూల్లో ఓ దివ్యాంగ విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి డ్రగ్స్ నిర్మూలనపై ప్లకార్డుతో అవగాహన కల్పించారు.