News March 3, 2025

గుడిహత్నూర్‌లో బాలిక సూసైడ్

image

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.

Similar News

News March 19, 2025

అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!

image

దాదాపు 9 నెలల తర్వాత ISS నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్‌పై ప్రపంచం దృష్టి నెలకొంది. కాగా అంతరిక్షంలో ఒకే ప్రయాణంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తుల్లో వాలేరి పోలికోవ్(రష్యా-437 డేస్) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫ్రాంక్ రుబియో(US-371d), మార్క్ వాండె(355), స్కాట్ కెల్లీ(340) ఉన్నారు. సునీత, విల్మోర్ తలో 286 డేస్ అంతరిక్షంలో ఉన్నారు. కాగా సునీత తన మూడు ప్రయాణాల్లో 608 రోజులు రోదసిలో ఉన్నారు.

News March 19, 2025

వరంగల్: సెల్ ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు!

image

సెల్‌ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు చేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. సమయం దాదాపు రాత్రి 7 గంటలు కావడంతో సెల్‌ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఏర్పాట్లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో స్నానాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

News March 19, 2025

సంగారెడ్డి: టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 22,411 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు.

error: Content is protected !!