News March 3, 2025
గుడిహత్నూర్‌లో బాలిక సూసైడ్

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News March 27, 2025
నేటి నుంచి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర

అనకాపల్లి పట్టణం తాకాశివీధిలో వేంచేసియున్న నూకంబిక అమ్మవారి జాతరను గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ టి.రాజేష్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. 28 సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కొత్త అమావాస్య జాతర జరుగుతుందన్నారు. జాతరలో నేలవేషాలు, స్టేజ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసామన్నారు.
News March 27, 2025
JGTL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం KNR, PDPL, JGTL, SRCL డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్‌పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో దిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
విశాఖలో ముఠా.. నకిలీ వెండి అమ్ముతూ అరెస్ట్

విశాఖలో బిహార్‌కు చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. నగరంలోని ఓ జువెలరీ షాపులో 3 కేజీల వెండిని అమ్మేందుకు వెళ్లారు. అనుమానంతో షాపు సిబ్బంది పరీక్షించగా అది నకిలీదిగా తేలడంతో ద్వారకా పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదే షాపులోని 2023లో నిందితులు ఏడు గ్రాముల గోల్డ్ కొట్టేసినట్లు గుర్తించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఐడీలతో మోసాలకు పాల్పడి అనంతరం సొంతూళ్లకు వెళ్లిపోతారు.