News March 14, 2025
గుడిహత్నూర్‌లో యువకుడి సూసైడ్

ఆనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహత్నూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రనికి చెందిన ఉప్పులేటి రవి గురువారం రాత్రి గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.
Similar News
News March 25, 2025
ADB: అక్రెడిటేషన్ గడువు పొడగింపు

మీడియా అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31 వరకు ముగియనున్న నేపథ్యంలో వాటి గడువు మరో మూడు నెలలు పొడగించినట్లు ఆదిలాబాద్ పౌర సంబంధాల అధికారిణి తిరుమల పేర్కొన్నారు. గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలోని పాత్రికేయుంతా మంగళవారం నుండి అక్రెడిటేషన్ కార్డ్స్ పై స్థిక్కర్లు వేయించుకోవాలి కోరారు.
News March 25, 2025
ADB జిల్లా వ్యాప్తంగా పోలీసులు మీకోసం

ప్రజలకు మంచి పోలీసు సేవలను అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టేషన్ SHOలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, ప్రతి పోలీసుకు క్రమశిక్షణ తప్పనిసరి అని సూచించారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను, మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని, ‘పోలీసు మీకోసం’ కార్యక్రమాలు కొనసాగాలన్నారు.
News March 24, 2025
ADB: కిషన్ రెడ్డిని కలిసిన MRPS జిల్లా అధ్యక్షుడు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో MRPS జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న దండోరా ఉద్యమానికి మొదటి నుంచి అండగా ఉండి కేంద్ర పెద్దలను కిషన్ రెడ్డి ఒప్పించారని మల్లేశ్ అన్నారు. అనంతరం ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువతో సత్కరించారు.