News March 11, 2025

గుడిహత్నూర్‌లో శిశువు మృతదేహం కలకలం

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం గురజ గ్రామ శివారులోని వాగులో మంగళవారం ఉదయం మగ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

Similar News

News March 14, 2026

పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.

News March 14, 2026

థర్డ్ పార్టీ అప్లికేషన్లపై అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

తెలియని థర్డ్ పార్టీ అప్లికేషన్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వీటి ద్వారా డాటా చోరీ, మొబైల్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ వారం 14 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 14, 2026

గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్ రాజర్షిషా

image

ఆదిలాబాద్ జిల్లాలో గృహ అవసరాలతో పాటు విద్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్.పీ.జీ. సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, చమురు కంపెనీల సేల్స్ అధికారులు, అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.