News October 19, 2024

గుడిహత్నూర్: అదుపు తప్పి గాలిలో ఎగిరిన కారు

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ వైపు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి గాలిలో ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. 

Similar News

News October 28, 2025

ఆదిలాబాద్‌లో బుధవారం పత్తి మార్కెట్ బంద్

image

అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసినందుకు ఈనెల 29న పత్తి మార్కెట్ కు బంద్ ఉంటుందని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. Kapas Kisan యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్‌ను రద్దు చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి మరుసటి పని దినాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పత్తి తేవద్దన్నారు.

News October 28, 2025

ADB: నారీమణులకు దక్కిన 10 మద్యం షాపులు

image

కొత్త మద్యం పాలసీ 2025–27లో 34 షాపులకు గాను ఆదిలాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా 10 షాపులు మహిళలకు లక్కీడ్రా ద్వారా దక్కాయి. షాప్‌ నం. 2, 9 విమలబాయి దక్కించుకున్నారు. తమ కుటుంబీకులకు సంబంధించిన మహిళల పేరిట షాపులు రావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు. కాగా మద్యం లక్కీడ్రాకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, అదృష్టవంతుల పేర్లు వచ్చాయి.

News October 27, 2025

తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

image

మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్‌ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.