News March 24, 2024
గుడిహత్నూర్: కౌలు రైతు ఆత్మహత్య

పంట దిగుబడులు రాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహాత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మన్నూరు గ్రామానికి చెందిన రైతు జాదవ్ రాజారాం (56) 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. రబీలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల దిగుబడి రాక మనస్తాపానికి గురైన రాజారాం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News February 28, 2026
ఆదిలాబాద్: రోబోటిక్స్ కోర్సు దరఖాస్తుకు నేడే ఆఖరు

ఆదిలాబాద్ పట్టణంలోని ATC కేంద్రంలో PMKVY 4.0 కింద ‘ఆటోమోటివ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీర్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఈ స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.
News February 28, 2026
ఆదిలాబాద్: ఆరుగురు దోపిడీ దొంగలు అరెస్టు

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్‌ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్థుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
News February 28, 2026
ఆదిలాబాద్: ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆదిలాబాద్‌లోని బాలక్ మందిర్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పేరుతో వినూత్న పైలెట్ ప్రాజెక్టును కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం ప్రారంభించారు. గణితం పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి, ఆసక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. గణితం ఒక క్లిష్టమైన విషయం కాదని, సరైన పద్ధతిలో నేర్పితే అది అత్యంత ఆసక్తికరమైన, ఉపయోగకరమైన శాస్త్రమని పేర్కొన్నారు.


