News March 6, 2025
గుడి ధ్వంసం.. MLA, అధికారులపై ఫిర్యాదు

లోయపల్లిలో గుడి ధ్వంసం చేసిన అధికారులపై, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై జాతీయ ST కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర కమిషన్‌కు అధ్యక్షుడు డా.కల్యాణ్ నాయక్, రంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా ఫిర్యాదు చేశారు. గత నెల 25న సేవాలాల్ మహారాజ్ గుడిని కొందరు కుట్రపూరితంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీని సస్పెండ్ చేయాలని, ST/SC కేసు నమోదు చేయాలని కోరారు.
Similar News
News April 23, 2025
HYD: తెలంగాణ పోలీస్ క్రీడాకారులకు 18 పతకాలు

కొచ్చిలో జరిగిన తొలి అఖిల భారత పోలీస్ బ్యాడ్మింటన్ క్లస్టర్ టోర్నీలో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ చూపారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీపడి12 మంది అధికారులు మొత్తం 18 పతకాలు గెలుచుకున్నారు. వాటిలో 2 బంగారు, 2 వెండి, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. వీరిని డీజీపీ జితేందర్ అభినందించారు. ఈ విజయం పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు.
News April 23, 2025
HYD: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: రిటర్నింగ్ అధికారి

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాల్లో 112 ఓటర్లకు మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 500 మంది సిబ్బంది, 250 మంది పోలీసులు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎన్నికల కారణంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఏప్రిల్ 23 సెలవు ఇవ్వగా.. జూన్ 14న హాజరుకావాలని సూచించారు.
News April 23, 2025
HYD: నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్

నెహ్రూ జూలాజికల్ పార్కులో హైదరాబాద్ జూ జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. మే మొదటి వారంలో ప్రారంభమై జూన్ వరకు ఈ సమ్మర్ క్యాంపు ఉంటుందన్నారు. 5 నుంచి పదవ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఒక్కరికి రూ.1000 ఫీజు ఉంటుందని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్యాంప్‌లో జూ టూర్, సరీసృపాల అవగాహన సెషన్, నైట్ హౌస్ సందర్శన, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు.