News August 30, 2024

గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం

image

గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Similar News

News September 20, 2024

ఈ నెల 30న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు

image

కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున ఆ మార్గం గుండా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు విజయవాడ-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను(నం.12718 &12717) ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News September 20, 2024

కృష్ణా: ANU డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y23 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News September 20, 2024

కృష్ణా: రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల జరిగిన బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు 2వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.