News November 25, 2024
గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై BIG UPDATE

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూంలల్లో ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల వద్ద కూడా ఎటువంటి బాత్రూం ఫొటోలు గానీ, వీడియోలు గానీ లేవని స్టేట్ ఫోరెన్సిక్ లేబరేటరీస్ పరీక్ష ద్వారా నిర్ధారణ అయినట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ గంగాధరరావు సంయుక్తంగా సోమవారం తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Similar News
News February 7, 2026
మచిలీపట్నంలో 38 మంది అధికారులపై చర్యలు

మచిలీపట్నం నగర పాలక సంస్థలో పని చేస్తున్న 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ACB అధికారులు చేపట్టిన తనిఖీల్లో బిల్లులు ఇవ్వకుండా కొత్త నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్నుల విధింపులో అవకతవకలు చేశారని గుర్తించారు. దీనికి బాధ్యులైన 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. వీరిలో అప్పటి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఉన్నారు.
News February 6, 2026
బందరు పోర్టుకు రూ.573.77 కోట్ల రహదారి ప్రాజెక్టు..!

బందరు పోర్టు అభివృద్ధికి ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్లతో భారీ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. NH-65, NH-216 జంక్షన్‌లను నేరుగా పోర్టుతో అనుసంధానిస్తూ 6 లైన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.
News February 6, 2026
కృష్ణా: టిడిపి జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నేడే

కృష్ణా జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిమ్మకూరు వేదికగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమితులైన వీరంకి గురుమూర్తి కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు, వివిధ హోదాల్లో నియమితులైన కార్యవర్గ సభ్యులు కూడా అదే సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


