News August 30, 2024
గుడ్లవల్లేరు ఘటనపై కలెక్టర్ ఆరా
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కలెక్టర్ డీ.కే బాలాజీతో పాటు, ఎస్పీ గంగాధర్ రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థినుల ఆందోళనపై వాస్తవ పరిస్థితులను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.
Similar News
News September 14, 2024
గొల్లపూడి వరకు HYD-VJA జాతీయ రహదారి విస్తరణ
HYD- VJA జాతీయ రహదారిని గొల్లపూడి వరకు విస్తరించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తొలుత దండుమల్కాపూర్(TG) నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని భావించినా, గొల్లపూడి వరకు 6 వరుసల రహదారి విస్తరించాలని కేంద్రం నిర్ణయించి ఈ పనులకు టెండర్లను ఆహ్వానించింది. 6 వరుసల రహదారి అందుబాటులోకి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి.
News September 14, 2024
కృష్ణా: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 25 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల విభాగం తెలిపింది.
News September 14, 2024
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మోర్(MS), సత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి నవంబర్ 31 వరకు ప్రతి శనివారం MS- SRC(నం.06077), ఈ నెల 23 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం SRC- MS(నం.06078) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.