News April 18, 2024
గుడ్లూరు: చెట్టును ఢీ కొట్టిన కూలీల ఆటో

గుడ్లూరు మండలం పొట్లూరు సమీపంలో రహదారిపై వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి మండలం అన్నగానిపాలెంకు చెందిన కూలీలు గుడ్లూరు మిర్చి కోతలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు.
Similar News
News December 13, 2025
ప్రకాశం జిల్లాలో 5.26 లక్షల సంతకాల సేకరణ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం తరలిస్తామని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు చేశారని చెప్పారు. వాటిని ప్రత్యేక వాహనం ద్వారా వైసీపీ ఆఫీసుకు తరలిస్తామన్నారు.
News December 13, 2025
ప్రకాశం: గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు

ప్రకాశం జిల్లాలోని 24 గ్యాస్ ఏజెన్సీలకు జేసీ గోపాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్యాస్ డెలివరీ సమయంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తేలింది. ఇకపై డెలివరీ బాయ్ ప్రవర్తన, రసీదుకు మించి డబ్బులు ఎక్కువగా వసూలు చేసినా ఉపేక్షించేది లేదని జేసీ హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ డెలివరీకి ఎక్కువ నగదు తీసుకుంటే ఊరిపేరు, ఏజెన్సీ పేరుతో కామెంట్ చేయండి.
News December 13, 2025
ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.


