News March 24, 2024
గుడ్లూరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుడ్లూరులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడ్లూరు మండలం నర్సాపురం గ్రామంలో పళ్లెం రాజేష్ అనే వ్యక్తి తెల్లవారుజామున గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తగులుకొని రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 1, 2025
అధ్యక్షా.. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి!

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన నడికుడి – కాళహస్తి రైల్వే లైన్, ఎప్పటి నుండో వేచి ఉన్న గిద్దలూరు రైల్వే గేటు బ్రిడ్జి, ఇతర రైల్వే అభివృద్ధి పనులు, పొగాకు రైతుల సమస్యలపై, అల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్ట్, పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. మరి MP ఏం ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది.
News December 1, 2025
BREAKING ప్రకాశం: క్రిస్మస్ ఏర్పాట్లు..ఇద్దరు మృతి.!

త్రిపురాంతకంలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్త అన్నసముద్రంలో విద్యుత్ ఘాతానికి గురై ఎస్సీ కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందారు. పచ్చిలగొర్ల విజయ్ (40) వీర్నపాటి దేవయ్య (35) సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.


