News March 24, 2024

గుడ్లూరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుడ్లూరులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడ్లూరు మండలం నర్సాపురం గ్రామంలో పళ్లెం రాజేష్ అనే వ్యక్తి తెల్లవారుజామున గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తగులుకొని రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 13, 2024

అల్పపీడనం.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బాపట్ల, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని ఇప్పటికే ప్రజల ఫోన్‌లకు మెసేజ్‌లు పంపిస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, సెల్ టవర్స్, విద్యుత్ స్తంభాల సమీపంలో, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.

News November 13, 2024

ప్రకాశం: ‘పోలీసు శాఖ ప్రతిష్ఠ పెంచేలా ఉండాలి’

image

పోలీస్ ప్రతిష్ఠ మరింత పెంచేందుకు సాయుధ బలగాల పనితీరు బాగుండాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఏఆర్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో మంగళవారం దర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాజువల్ లీవు, ట్రాన్స్ఫర్స్, టిఏలు, అలవెన్సులు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసుల బందోబస్తులు, జీపీఎఫ్ లోన్, మెడికల్ బిల్లులు, సీనియారిటీ లిస్టు తదితర సమస్యల గురించి చర్చించారు.

News November 13, 2024

ఒంగోలు: యువతిని గర్భవతిని చేసిన మామ

image

తండ్రిలేని యువతిని ఒంగోలుకు చెందిన మేనమామ గర్భవతిని చేసిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం.. భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ఆదిలాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో కోడలిని లొంగదీసుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయంపై తెనాలి పోలీసులకు సమాచారం ఇచ్చారు.