News May 24, 2024
గుత్తి: రైలు కిందపడి వ్యక్తి మృతి

గుత్తి రైల్వేస్టేషన్‌లోని యార్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందారు. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన మాల కంబగిరి స్వామిగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. కంబగిరి స్వామి చిత్తు పేపర్లు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గుత్తి యార్డులో చిత్తు పేపర్లు ఏరుకుంటున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News March 12, 2025
రేపు కలెక్టర్ అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.
News March 12, 2025
రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

ప్రాథమిక రంగం వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం అనంతపురంలోని ఆదిమూర్తి నగర్లో ఉన్న జిల్లా హార్టికల్చర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. వివిధ రకాల పంటలు పండిస్తున్న రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు.
News March 12, 2025
తాత్కాలికంగా ఆ రైలు అనంతపురం వరకే!

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం(17215), ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు తాత్కాలికంగా అనంతపురం-ధర్మవరం మధ్య రద్దు చేశారు. ధర్మవరంలోని ప్లాట్ ఫాం నంబర్ 5పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు మచిలీపట్నం నుంచి అనంతపురం వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఈనెల 13 నుంచి 31వ తేదీ వరకు ఈ రైలు అనంతపురం నుంచే బయలుదేరి మచిలీపట్నం వెళ్తుంది.