News January 29, 2025

గుత్తి వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

గుత్తి మండలం రజాపురం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుత్తి మండలం కొత్తపల్లికి చెందిన చాకలి పవన్, గొల్ల పవన్ బైక్‌లో గుంతకల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మట్టి కుప్పను ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చాకలి పవన్ మృతి చెందగా గొల్ల పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News November 13, 2025

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

image

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News November 12, 2025

గుత్తిలో వ్యక్తి మృతి

image

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎస్పీ

image

శాంత్రిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల ఛేదనకు టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.