News June 26, 2024
గుత్తి: 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

గుత్తి మండలంలోని రజాపురంలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆహార కల్తీ వల్ల సుమారు 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు రెడ్డి, తహశీల్దార్ భారతి ఎంపీడీవో శ్రీనివాసులు బుధవారం పాఠశాలను సందర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.
Similar News
News November 3, 2025
తరచూ బాలల సంరక్షణా కేంద్రాలను తనిఖీ చేయాలి: జేసీ

జిల్లాలో ప్రస్తుతం ఉన్న బాలల సంరక్షణా కేంద్రాలను సంబంధిత శాఖ అధికారులు తనిఖీ చేయాలని జేసీ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లో బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫారసు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాలల సంరక్షణా కేంద్రాలలో బాలలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.
News November 3, 2025
‘అనంతపురాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలి’

అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం నార్పల తహశీల్దార్ కార్యాలయం ముందు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అతివృష్టి కారణంగా ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.


