News February 14, 2025
గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి: హరీశ్‌రావు

పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనకి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండని, డంపింగ్ యార్డ్ వద్దంటే మొండిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. CM రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నాడని, వందల మందిని పోలీస్ స్టేషన్లలో పెట్టి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడన్నారు.
Similar News
News November 28, 2025
ఏకగ్రీవాలకు వేలంపాటలు.. SEC వార్నింగ్

TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాలకు జోరుగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకులా డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటలో కొనుగోలు చేయడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News November 28, 2025
IPLలో వైభవ్.. WPLలో దీయా

WPL వేలంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల దీయా యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ అయిన ఆమెను రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దీంతో WPLలో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. 2023 U-15 ఉమెన్స్ ట్రోఫీలో 578 రన్స్ బాదడంతో దీయా పేరు తెరపైకి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ 13ఏళ్లకే IPLలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
News November 28, 2025
కృష్ణా: నాడు – నేడు పనులు.. పూర్తి చేస్తే బాగు..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు 90% పూర్తైనా, కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల లేమి కారణంగా అసంపూర్తిగా మారాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణాలో 100కు పైగా పాఠశాలల్లో మౌలిక వసతులు, 600 స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.


