News June 19, 2024
గుమ్మడిదల: కోళ్ల ఫారంలో అల్ఫాజోలం తయారీ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ కోళ్లఫారంలో అల్ఫాజోలం తయారీ చేస్తున్న కేంద్రంపై జిల్లా SP రూపేష్, టీఎస్ న్యాబ్, గుమ్మడిదల పోలీసులు దాడి చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఆరు నెలలుగా మత్తు పదార్థాలైన అల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.40లక్షల విలువైన 2.60 లక్షల విలువైన అల్ఫాజోలం, రూ.60లక్షలు విలువైన ముడి పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు SP తెలిపారు.
Similar News
News September 9, 2024
MDK: విద్యుదాఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి
గణేశ్ మండపం వద్ద విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో పంచాయతీ స్వీపర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రాజుపేట గ్రామానికి చెందిన దాసరి పోచయ్య (70) ఈరోజు ఉదయం మండపం వద్ద శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News September 9, 2024
MDK: క్విజ్‌లో గెలిస్తే రూ.10లక్షలు
RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం 71 కళాశాలలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.
News September 8, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.