News April 4, 2025
గుమ్మడిదల: నాటు తుపాకీ, గంజాయి స్వాధీనం

నాటు తుపాకీ, గంజాయిని గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు. జిన్నారం CI నయీముద్దీన్ వివరాలు.. బీహార్కు చెందిన భూపేంద్ర కుమార్ ఆరేళ్లుగా దోమడుగులో కిరాయికి రూమ్ తీసుకొని శ్యామ్ పిస్టమ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జీతం సరిపోక ఎక్కువ డబ్బు సంపాదించాలని బీహార్ నుంచి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు అతడి ఇంటిని తనిఖీ చేయగా నాటు తుపాకీ, 2 బుల్లేట్లు, 930 గ్రాముల గంజాయి పట్టుబడింది.
Similar News
News November 17, 2025
సిద్దపేట: ప్రతి శనివారం సీపీతో ‘ఫోన్-ఇన్’

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శనివారం ‘పోలీస్ కమిషనర్ తో ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. సమస్యలు, ముఖ్యమైన అంశాలపై నేరుగా కమిషనర్తో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ప్రజలు 8712667100, 8712667306, 8712667371 నంబర్లకు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.
News November 17, 2025
హనుమకొండ: కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో దాస్యం భేటీ

కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మాజీ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ భేటీ అయ్యారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు ముచ్చటించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నేతలు పులి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
News November 17, 2025
EVM గోడౌన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

EVM గోడౌన్ వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.


