News June 14, 2024
గుమ్మడిదల: రోడ్డు ప్రమాదంలో బైక్ మెకానిక్ మృతి
రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్‌ను ఢీకొని బైక్ మెకానిక్ మృతి చెందిన ఘటన గుమ్మడిదల మండలంలో నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన గణేష్(31) బైక్ మెకానిక్. నిన్న రాత్రి తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం తిరిగి కారులో ఇంటికి వస్తుండగా అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
Similar News
News September 17, 2024
సంగారెడ్డి: 1200 మంది పోలీసులతో బందోబస్తు
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 17న జరిగే వినాయక నిమజ్జనానికి 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ సోమవారం తెలిపారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
News September 16, 2024
సంగారెడ్డి: రికార్డు ధర పలికిన గణపతి లడ్డూలు
వాడవాడలా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. కానుగుంటలో శ్రీఏకశిలా వరసద్ధి వినయాక దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం లడ్డూ వేలం పాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.2.02 లక్షలు పలికింది. గోవర్ధన్ రెడ్డి లడ్డూని దక్కించుకోగా.. మరో లడ్డూను రూ. 80 వేలకు విశాల్ గౌడ్ దక్కించుకున్నారు.
News September 16, 2024
గుండెపోటుతో టీచర్ మృతి.. నేత్రదానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మోడల్ స్కూల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు ధ్యాప వెంకటస్వామి(49) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. మృతుడి స్వస్థలం జగదేవ్పూర్ మండలం అలిరాజపేట గ్రామం. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, వయస్సు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. వెంకట్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానానికి ఆ కుటుంబీకులు ముందుకొచ్చి మరో ఇద్దరికి చూపు ఇచ్చారని మిత్రబృందం తెలిపింది.