News April 24, 2024
గుమ్మనూరు జయరాం ఆస్తుల విలువ రూ.78.93 లక్షలు
గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో నమోదు చేసిన వివరాలు.. ఆయన ఎస్‌ఎస్ఎల్‌సీ విద్యార్హతగా పేర్కొన్నారు. ఆయనపై ఒక్క కేసు ఉంది. అదేవిధంగా చరాస్తులు రూ.18.93 లక్షలు, స్థిరాస్తులు రూ.60లక్షలు, బంగారం 173 గ్రాములు, అప్పులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Similar News
News January 17, 2025
పెనుకొండ కియా నుంచి కొత్త కారు
పెనుకొండ కియా కంపెనీ నుంచి కియా సిరోస్ (Kia Syros) కారు ఉత్పత్తి ప్రారంభమైంది. ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్న ఆటో ఎక్స్‌పో-2025లో ఈ కారును ప్రదర్శించనున్నారు. అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 1న కారు ధర నిర్ణయిస్తామని సీఈవో హొసంగ్ తెలిపారు. ఇప్పటికే 10,258 మంది బుక్ చేసుకున్నారని చెప్పారు. ఫిబ్రవరిలో ఈ కారు డెలివరీలు ప్రారంభమవుతాయని వివరించారు.
News January 16, 2025
పక్షుల కోసం 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్ల ఏర్పాటు
పక్షులను రక్షించడానికి 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్లు ఏర్పాటు చేసి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కావడం అభినందనీయమని అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ పేర్కొన్నారు. గ్రీన్ ఆర్మీ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ అచ్చుల కోసం గూళ్లను ఏర్పాటు చేయడంపై కలెక్టర్ అభినందించారు. ఇందుకు హార్వర్డ్ వరల్డ్ రికార్డ్ వారు సర్టిఫికెట్ ఇచ్చారన్నారు.
News January 16, 2025
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి: కలెక్టర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లు కేటాయించిన లక్ష్యాలను నెల రోజుల్లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రుణాల మంజూరులో 100 శాతం లక్ష్యాలు చేరుకోవాలన్నారు.