News March 25, 2024
గుమ్మనూరు జయరామ్‌కు మూడో జాబితాలో మొండిచేయి

టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలో గుమ్మనూరు జయరామ్‌కు చోటు దక్కలేదు. గుంతకల్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు ఐవీఆర్ఎస్ సర్వేలో అనుకూలత లేదని సీటు నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే గుంతకల్లులో పార్టీ కార్యాలయం స్థాపించి గుమ్మనూరు సోదరులు ప్రచారాలు సైతం నిర్వహించారు. అయితే అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 21, 2025
ATP: నీటి కుంటలో పడి బాలుడి మృతి

పెద్దవడుగూరు మండలం రావులుడికి చెందిన కమలేశ్వర్ రెడ్డి (8) ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో కమలేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. గ్రామ శివారులోని కుంటలోకి ప్రమాదవశాత్తు జారి పడి ఊపిరాడక మృతి చెందాడు. బాలుడు మృతి చెందడంతో రావులుడికిలో విషాదఛాయలు అలముకున్నాయి.
News December 21, 2025
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

పల్స్ పోలియోలో భాగంగా వజ్రకరూరు మండల కేంద్రంలోని PHCని ఆదివారం DMHO డాక్టర్ భ్రమరాంబ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పలు రికార్డులు, వార్డులను తనిఖీ చేశారు. అనంతరం పల్స్ పోలియో కేంద్రాలలో పల్స్ పోలియో చుక్కలు ఎంతమంది పిల్లలకు వేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు త్యాగరాజు, గంగాధర్, మండల వైద్యాధికారులు డాక్టర్ తేజస్వి, సర్దార్ వలి ఉన్నారు.
News December 21, 2025
2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు: DMHO

అనంతపురం జిల్లాలో 0-5 ఏళ్ల మధ్యగల 2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO దేవి తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 1,785 పోలింగ్ బూత్‌లలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించామన్నారు.


