News July 15, 2024

గుమ్మలక్ష్మీపురంలో యూట్యూబర్ హర్షసాయి పేరిట ఛీటింగ్

image

యూట్యూబర్ హర్షసాయి పేరిట గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయికి చెందిన బిడ్డిక సోమేశ్ సైబర్ మోసానికి గురయ్యాడు. హర్షసాయి హెల్పింగ్ టీమ్ నుంచి రూ.3 లక్షలు సాయం చేస్తామని యువకుడి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఖాతా నిర్ధారణకు రూ.1150 వేయాలని కోరగా సోమేశ్ నగదు చెల్లించాడు. తొలి విడత లక్ష వేసినట్లు నకిలీ స్క్రీన్ షాట్ పంపించారు. జీఎస్టీ లేని కారణంగా నగదు జమకాలేదని.. మరికొంత వేయాలనగా నగదు చెల్లించి మోసపోయాడు.

Similar News

News February 26, 2026

VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ (M) గుడివాడకు చెందిన గుడివాడ కిషోర్ (19) తన బైక్‌ పై కొట్యాడలో ఉన్న తాతగారి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖాసాపేట సమీపంలో గల వంతెన వద్ద బైక్ అదుపు తప్పడంతో గెడ్డలో పడి మునిగి మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ పాపారావు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 26, 2026

53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.

News February 26, 2026

VZM: ‘ఆ ఉద్యోగులకు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి’

image

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆదేశించారు. ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం పనివేళల ముగింపునకు ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మసీదులు, ముస్లిం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, బ్లీచింగ్ నిర్వహించాలన్నారు.