News March 30, 2024
గురజాలలో లోకల్ మేనిఫెస్టో డైలాగ్ వార్

గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య లోకల్ మేనిఫెస్టోపై డైలాగ్ వార్ నడుస్తోంది. యరపతినేని ఆరు అంశాలతో లోకల్ మ్యానిఫెస్టో ప్రకటించగా అది సమగ్రంగా లేదని కాసు విమర్శించారు. 30 ఏళ్ల పాటు తనను ఆదరించిన ప్రజలకు వ్యక్తిగత ఖర్చులతో మేనిఫెస్టో రూపొందించామని యరపతినేని అన్నారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై కాసు కూడా 10 అంశాలతో లోకల్ మేనిఫెస్టో ప్రకటించారు.
Similar News
News July 8, 2025
GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్‌తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.
News July 8, 2025
గుంటూరులో కూరగాయల ధరలు రెట్టింపు

గుంటూరు మార్కెట్లలో టమాటా, పచ్చిమిరప, వంకాయ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పచ్చిమిరప కిలో రూ.80కి చేరగా, టమాటా రూ.40, వంకాయ రూ.60 పలుకుతోంది. ములక్కాయ ఒక్కటి రూ.15 నుంచి రూ.20కి పెరగడం వినియోగదారులను కుదిపేస్తోంది. డిమాండ్‌తో పోల్చితే సరఫరా తక్కువగా ఉండటం వల్లే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు తెలిపారు. రైతుబజార్లలో కూడా ఇదే స్థితి కొనసాగుతోంది.
News July 8, 2025
GNT: ఆన్లైన్ ట్రేడింగ్ మాయలో భారీ నష్టం.. ఎస్పీకి ఫిర్యాదు

పొన్నూరు ఇటికంపాడు రోడ్డుకు చెందిన మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి గురయ్యారు. ఓ యాప్ డౌన్లోడ్ చేసి ట్రేడింగ్ ప్రారంభించగా, కాల్స్ ద్వారా ఆకర్షితుడై రూ.27 లక్షలు మోసపోయారు. మొదట లాభాలంటూ ఆశ చూపి తర్వాత మొత్తం కట్టించారని, తర్వాత ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదని సోమవారం ఆయన ఎస్సీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.