News May 19, 2024

గురజాల: అల్లర్లు, హింసాత్మక ఘటనలు చేసిన వారికోసం ముమ్మర తనిఖీలు

image

సబ్ డివిజన్ పరిధిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గురజాల, మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై మొత్తం 59 కేసులు నమోదు చేయగా ఇప్పటి వరకు 584 మంది గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం అధికారులు సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.

Similar News

News December 13, 2024

పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు

image

సినీ హీరో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పద్మవ్యూహం నుంచి బయటకి వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు! అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.

News December 13, 2024

పిడుగురాళ్ల: Love Failureతో సూసైడ్

image

పిడుగురాళ్ల మండలంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన నూర్జిత్ కుమార్ (20) కుటుంబ సభ్యులతో పిడుగురాళ్ల మండలం కామేపల్లికి వరి మిషన్‌తో పాటు వచ్చారు. కొంతకాలంగా ఆ ప్రాంతంలో ఓ యువతిని ప్రేమించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ప్రేమ విఫలం కావడంతో చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 13, 2024

బైక్ కొనలేదని తాళాలు మింగిన యువకుడు

image

గుంటూరు జీజీజీహెచ్ లో ఓ యువకుడి కడుపులో నుంచి వైద్యులు నాలుగు <<14859523>>తాళాలు బయటకు తీసిన సంగతి తెలిసిందే<<>>. అయితే బైక్ కొనివ్వలేదనే కారణంతోనే యువకుడు తాళాలు మింగినట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన దేవర భవానీప్రసాద్(28) బండి కొనిపెట్టలేదని మనస్తాపంతో తాళాలు మింగేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకురావడంతో సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపీ విధానంలో డాక్టర్లు తాళాలను బయటకు తీశారు