News March 19, 2024
గురజాల: కరపత్రాలు పంచిన వాలంటీర్.. విధుల నుంచి తొలగింపు
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వాలంటీర్‌ను, విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీవో సదరు వాలంటీర్‌ను విధులు నుంచి తొలగించారు. వాలంటీర్ దగ్గర నుంచి సెల్ ఫోను బయోమెట్రిక్ డివైస్‌ను స్వాధీనపరుచుకున్నారు.
Similar News
News December 29, 2024
నరసరావుపేటలో సీఎం పర్యటన ఇలా.!
నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. 11.40 వరకు పింఛన్లు అందజేస్తారు. అనంతరం గ్రామంలోని ఆలయాన్ని సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండకు చేరుకొని 2.20కి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని 3.10లకు ముఖ్యమంత్రి తిరిగి ఉండవల్లి చేరనున్నారు.
News December 29, 2024
గుంటూరు జిల్లాలో 16 శాతం క్రైమ్ రేటు తగ్గింది: ఎస్పీ
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సతీశ్ కుమార్ వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోల్చితే 16 శాతం క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 5 శాతం పెరిగాయని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 224 మందిని గంజాయి కేసుల్లో పట్టుకొని 12 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు.
News December 29, 2024
పెదకాకాని: మహిళ అనుమానాస్పద మృతి
పెదకాకాని(M) నంబూరులో మల్లికా(29) అనే మహిళ శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మల్లిక మొదటి భర్తతో విడిపోయి ప్రేమ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య మంచంపై శవమై ఉంది. మెడ మీద గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు మాస్కులు ధరించి వచ్చి వెళ్లినట్లు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.