News June 5, 2024

గురజాల, మాచర్ల అభ్యర్థులకు మంత్రి పదవి దక్కేనా?

image

గురజాల, మాచర్ల‌లో TDP అభ్యర్థులు గెలిచారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇక్కడి MLAలకు మంత్రి పదవి దక్కలేదు. గురజాల నుంచి వరుసగా 7సార్లు పోటీ చేసి 4సార్లు గెలిచిన యరపతినేనికి పలుమార్లు మంత్రి పదవి చేతిదాకా వచ్చి జారిపోయింది. ఒక దశలో యరపతినేని అనధికార హోంమంత్రిగా చక్రం తిప్పారు. చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన యరపతినేనికి రానున్న మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Similar News

News November 6, 2024

CRDA పరిధిలోకి పల్నాడు జిల్లా.. కేబినెట్ ఆమోదం

image

సీఆర్డీఏ పరిధి పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా సీఆర్డీఏ పరిధిలోకి చేరింది. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1069.55 చదరపు కి.మీ విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను చేర్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధి నిధులతో పల్నాడు మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 6, 2024

విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలి: గుంటూరు ఎస్పీ 

image

క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో శాంతిభద్రత సమస్యలను పరిష్కరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ని ఎస్పీ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరను స్వయంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదిదారుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని, పెండింగ్ వాహనాలను త్వరగా డిస్పోస్ చేయాలని ఆదేశించారు.

News November 5, 2024

తుళ్లూరు: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో 400/220 కేవీ సబ్ స్టేషన్ నవంబర్ 7న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించి మాట్లాడారు. సీఆర్డీఏ పరిధిలో భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా కేవీ సబ్ స్టేషన్‌ను జీఐఎస్ పద్ధతిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాన్స్కో ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు.