News October 18, 2024
గురుకులాలకు సొంతభవనాలు ప్రభుత్వమే నిర్మించాలి : సీపీఎం

గురుకులాలకు సొంతభవనాలు ప్రభుత్వమే నిర్మించాలని, సరుకులు సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల గురుకుల భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో యజమానులు హాస్టళ్లకు తాళాలు వేసి మూసి వేశారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర నష్టమని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే భవనాలను తెరిపించి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం కార్పొరేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల హవా!

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అధికార కాంగ్రెస్ కార్పొరేటర్ల కంటే బీఆర్ఎస్ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపల్ కాంట్రాక్టులు, ఎల్ఆర్ఎస్ పనులలో అధికారులు వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై, రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
News November 25, 2025
ఖమ్మం: అంతా ‘మొంథా’ర్పణం

ఖమ్మం జిల్లాలో ‘మొంథా’ తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ సర్వేచేసి తుది నివేదిక విడుదల చేసింది. జిల్లాలో 17మండలాల్లో 4,268మంది రైతులకు చెందిన 1, 710.72హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తేల్చారు. 1,499.43 ఎకరాల్లో వరి, 115.82హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లిందిని కలెక్టర్కు నివేదిక అందజేశారు. అత్యధికంగా కూసుమంచి డివిజన్లో 766.12 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
News November 25, 2025
ఎన్పీడీసీఎల్లో 17 మంది ఇంజనీర్లకు పదోన్నతులు

ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి సంస్థలోని పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో ముగ్గురు ఏడీఈలకు డీఈలుగా, 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏడీఈలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన రాందాసు కార్పొరేట్ ఆఫీస్కు, రమేష్ వైరా డివిజన్కు బదిలీ అయ్యారు. ఈ చర్యతో విభాగాల పనితీరు మెరుగుపడుతుందని సంస్థ తెలిపింది.


