News October 18, 2024
గురుకులాలకు సొంతభవనాలు ప్రభుత్వమే నిర్మించాలి : సీపీఎం
గురుకులాలకు సొంతభవనాలు ప్రభుత్వమే నిర్మించాలని, సరుకులు సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల గురుకుల భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో యజమానులు హాస్టళ్లకు తాళాలు వేసి మూసి వేశారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర నష్టమని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే భవనాలను తెరిపించి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News November 8, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాను వణికిస్తున్న చలి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం వణికిపోతున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రతలు సుమారు 15 డిగ్రీలు నమోదవుతోంది. ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతవరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంతో.. చిన్నపిల్లలు వృద్ధుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News November 8, 2024
ఖమ్మం: సమగ్ర సర్వేపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్
ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సర్వే నిర్వహణకు నిర్దేశించిన ఫార్మాట్లో ఫారాలు సిద్ధమయ్యాయా, సిబ్బందికి అవసరమైన పరికరాలు, స్టేషనరీ ఐటెమ్స్ పంపిణీ మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News November 8, 2024
“తోపుడు బండి సాదిక్” ఇక లేరు.. ఎక్స్‌లో హరీశ్ రావు ఎమోషనల్ ట్వీట్
కల్లూరుకు చెందిన “తోపుడు బండి సాదిక్”గా పేరొందిన సాదిక్ అలీ మృతి బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం X ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. వివిధ రకాలుగా సాదిక్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తోపుడు బండిలో పుస్తకాలు పెట్టుకుని పంపిణీ చేశారని చెప్పారు.