News February 2, 2025
గురుకులాల్లో దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్న వివిధ గురుకులాలలో ప్రవేశాల కోసం, దరఖాస్తు స్వీకరణ గడువును ఫిబ్రవరి 6 వరకు పెంచుతున్నట్టు గురుకులాల సెక్రటరీ వీఎస్ అలుగు వర్షిణి శనివారం తెలిపారు. గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశాల గడువు ఫిబ్రవరి 1 అయినప్పటికీ పలు కారణాలతో ఫిబ్రవరి 6 వరకు గడువును పొడిగిస్తున్నామని వెల్లడించారు.
Similar News
News February 19, 2025
HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్‌కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్‌సైట్ చూడొచ్చు.
News February 18, 2025
HYD: వాదిస్తూ.. కుప్పకూలిన సీనియర్ లాయర్

హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌కు గుండెపోటు వచ్చింది. హైకోర్టులో వాదిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టులో అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు.
News February 18, 2025
HYD: ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు: సీఎం

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. HYDలోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్ -2025 కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ప్రారంభించారు.