News May 24, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ 28కి వాయిదా

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25లో ప్రథమ ఇంటర్‌లో, ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24, 25వ తేదీల్లో అడవి తక్కెళ్లపాడు అంబేడ్కర్ బాలుర గురుకులంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్ 28వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా సమన్వయకర్త కె. పద్మజ తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం బాలురు ఈనెల 28, బాలికలు 29న ఉదయం 10 గంటలకు గురుకులంలో హాజరు కావాలని తెలిపారు.

Similar News

News October 31, 2025

పంట పొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలి: కలెక్టర్

image

పంటపొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పంట దెబ్బతినకుండా కాపాడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేసి ఉన్నారని గుర్తు చేశారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

News October 31, 2025

వరకట్న నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

వరకట్న నిషేధ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వరకట్న నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. యువతలో ఎక్కువగా అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

News October 31, 2025

పెదకాకాని మండలం తెనాలి డివిజన్‌లోకి.?

image

జిల్లా పునర్విభజనపై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారం పెదకాకాని మండలం తెనాలి రెవెన్యూ డివిజన్‌లోకి మారే అవకాశం ఉందని సమాచారం. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్‌లో ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఈ మార్పు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం గుంటూరు, తెనాలి డివిజన్‌లలో విభజింపబడి ఉండటంతో పెదకాకాని మార్పుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.