News May 24, 2024
గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ 28కి వాయిదా

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25లో ప్రథమ ఇంటర్‌లో, ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24, 25వ తేదీల్లో అడవి తక్కెళ్లపాడు అంబేడ్కర్ బాలుర గురుకులంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్ 28వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా సమన్వయకర్త కె. పద్మజ తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం బాలురు ఈనెల 28, బాలికలు 29న ఉదయం 10 గంటలకు గురుకులంలో హాజరు కావాలని తెలిపారు.
Similar News
News March 7, 2026
గుంటూరు: రేపు గురుకులాల్లో ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు 6, 7 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.
News March 7, 2026
గుంటూరు: మిర్చి యార్డుకు సరకు రాకల్లో హెచ్చుతగ్గులు

గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే టిక్కీల సంఖ్యలో మార్పులు కనిపిస్తున్నాయి. రెండు రోజులు లక్షా 25 వేల వరకు టిక్కీలు వచ్చినా శుక్రవారం సుమారు 88 వేలకే పరిమితమయ్యాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఈ తగ్గుదలకు స్పష్టమైన కారణం లేదు. హోలీ కారణంగా ఈ వారంలో నాలుగు రోజులు మాత్రమే లావాదేవీలు జరిగాయి. సోమవారం 1,04,740 టిక్కీలు రాగా తరువాత రోజుల్లో సంఖ్య పెరిగింది. ప్రస్తుతం యార్డులో 26 వేల మిర్చి బస్తాలు ఉన్నాయి.
News March 7, 2026
జనాభా పెంపునకు గుంటూరులో పైలెట్ ప్రాజెక్ట్..?

రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త జనాభా నిర్వహణ విధానాన్ని సిద్ధం చేస్తోంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లాను ఎంపిక చేసే అవకాశముంది. కుటుంబాలకు ప్రోత్సాహక ప్యాకేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సకు సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తోంది. జననాల రేటు పెంచేందుకు మాతృత్వ సేవలు, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.


