News February 26, 2026
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్

మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5, 6,7,8 తరగతులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని పల్నాడు జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ పి. పరమేశ్వరరావు కోరారు. పల్నాడు జిల్లాలో దాచేపల్లి, సత్తెనపల్లి, వినుకొండ, నరసరావుపేట స్కూళ్లల్లో ప్రవేశ అర్హులైన అభ్యర్థులు ఈనెల 4 నుంచి మార్చి 3 వరకు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్సైట్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News April 18, 2026
వచ్చే సీజన్‌కు KKR కోచ్‌గా మెక్‌కల్లమ్: పీటర్సన్

వచ్చే సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ వస్తారని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అంచనా వేశారు. ఇది జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తూ తన ట్వీట్‌ను బుక్ మార్క్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా 2022 నుంచి మెక్‌కల్లమ్ కొనసాగుతున్నారు. గతంలో KKRకు ఆడారు. మరోవైపు KKR పేలవ <<19678736>>ప్రదర్శన<<>> కొనసాగుతోంది. ఒక్క గెలుపూ లేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
News April 18, 2026
కొత్త SEకి కలెక్టర్ సూచన

వరంగల్ విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనందం శుక్రవారం కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన విద్యుత్ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జూన్ 2న భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నందున పనుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ భేటీలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
News April 18, 2026
కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


