News March 13, 2025
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏపీ గురుకుల పాఠశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి 5,6,7,8 తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశానికి 80సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 6,7,8 తరగతిలో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో కోరారు. ఆసక్తి గలవారు https://aprs.ofss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
Similar News
News February 12, 2026
NLG: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత!

నల్గొండ జిల్లా 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
News February 12, 2026
నిర్మల్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

కుబీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ఆత్మహత్య చేసుకుంది. భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News February 12, 2026
విద్యార్థులు ఏమనుకుంటారు.. YCP ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆవేదన

AP: నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన <<19108172>>తీరుపై<<>> స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీకి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు. సభలో జరిగిన ఆ విధానాన్ని చూసి వారు ఏమనుకుంటారు. ఇంటికెళ్లిన తర్వాత వారు తోటి విద్యార్థులతో ఏం చెబుతారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో కాగితాలు చించి విసిరేశారు. అది సరైన పద్ధతేనా’ అని విచారం వ్యక్తం చేశారు.


