News March 29, 2025
గురుకుల విద్యార్థి మృతి బాధాకరం: హరీశ్ రావు

సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్న జ్వరానికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ వైఫల్యానికి ఇదొక నిదర్శనమన్నారు. నిఖిల్ కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 7, 2025
కేయూ మెస్‌లో మళ్లీ నిర్లక్ష్యం.. ఉప్మాలో పురుగులు

HNK కాకతీయ యూనివర్సిటీలో మెస్ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న చపాతీ కోసం కష్టపడిన విద్యార్థులకు ఆదివారం టిఫిన్‌లో ఉప్మాలో పురుగులు కనిపించడంతో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రశ్నించగా మెస్ సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. భోజన నాణ్యతపై పదేపదే ఫిర్యాదులు వచ్చినా యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
ఎచ్చెర్ల : జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా భాస్కరరావు

ముద్దాడ రేషన్ డిపో డీలర్ పగడ భాస్కరరావును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమిస్తూ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. పౌరసరఫరాల శాఖ రేషన్ డిపోలో పారదర్శకతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించారు. తనకు అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా చేస్తానని భాస్కర్ రావు తెలిపారు.
News December 7, 2025
పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.


