News April 12, 2025

గురుకుల విద్యార్థులకు మంత్రి స్వామి అభినందనలు

image

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో 96% ఉత్తీర్ణత సాధించిన గురుకుల పాఠశాలల విద్యార్థులకు మంత్రి స్వామి శనివారం అభినందనలు తెలిపారు. ఈ ఉత్తీర్ణత సాధనలో భాగస్వాములైన గురుకుల సంస్థ ఉన్నతాధికారులకు, ఉపాధ్యాయులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇలాంటి విజయాలను కొనసాగిస్తూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Similar News

News April 15, 2025

ప్రకాశం: AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

image

AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సోమవారం ఫైర్ అయ్యారు. “జగన్‌‌ని హత్యచేయాలన్న పన్నాగంతోనే శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టుగా ఛార్జ్ షీట్‌లో ఎన్‌ఐఏ చెప్పిన విషయం AB వెంకటేశ్వరరావు మరిచిపోయారా అని ప్రశ్నించారు.  జగన్‌పై దాడి చేసిన సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్‌కి, ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మీకు నామినేటెడ్ పోస్టులు ఎలా వచ్చాయ్? అంటూ ప్రశ్నించారు.

News April 15, 2025

బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ దామోదర్

image

తాళ్లూరు మండలం సోమవారపాడు, తూర్పు గంగవరంలోని గుంటి గంగాభవాని అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీస్ బందోబస్తును సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. తిరుణాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టిగా ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు సూచించారు. 

News April 15, 2025

ప్రకాశం జిల్లాలో ఇద్దరి మృతి

image

ప్రకాశం జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. మార్కాపురం మండలం రాయవరం బ్రిడ్జిపై బైక్ అదుపు తప్పడంతో ఈదా కాశి అనే యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు వద్ద రెండు బైకులు ఎదురుగా ఢీకొనడంతో కడప జిల్లాకు చెందిన పెద్ద ముస్తఫా అనే వ్యక్తి మృతి చెందాడు.

error: Content is protected !!