News February 12, 2025
గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రి

జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించిన బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి బాలవీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు, ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులలోని గురుకుల పాఠశాలల నుంచి మొత్తం 190 మంది పరీక్షకు హాజరుకాగా 110మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. వారిని మంత్రి స్వామి అభినందించారు
Similar News
News March 28, 2025
కొనకనమిట్ల: తమ్ముడి కళ్ల ఎదుటే అన్న మృతి

చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొనకనమిట్ల(M) సిద్దవరానికి చెందిన చప్పిడి రమేశ్ (25) తమ్ముడు చిన్నాతో బైకుపై వెళ్తున్నారు. ముందుగా వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తమ్ముడి కళ్లదుటే అన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 28, 2025
ప్రకాశం జిల్లాలోనే అధిక ఎండలు

ప్రకాశం జిల్లాలో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో అధిక ఎండలు ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఎండలకు బయటకు వెళ్లేముందు, గొడుగు, టోపీలు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం మంచు కురవడం గమనార్హం.
News March 28, 2025
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించండి: మంత్రి స్వామి

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్‌లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.