News April 5, 2024
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఫోటో గ్రాఫర్ మృతి

కోదాడకు చెందిన గుండు రవి పని నిమిత్తం ఖమ్మం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై కోదాడ వస్తుండగా వెంకటాపురం వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రవి కోదాడలో ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రవి మృతి పట్ల ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ నాయకులు, మిత్రులు బంధువులు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News December 7, 2025
NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
నల్గొండ: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ ఎ.అనిత తెలిపారు. అర్హత, పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 6, 2025
మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.


