News April 15, 2025
గుర్తు తెలియని వృద్ధుడు మృతి

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఏఎస్ఐ యాకుబ్ అలీ వివరాల ప్రకారం.. అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వృద్ధుడు అస్వస్థకు గురై కనిపించడంతో స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.
Similar News
News November 1, 2025
పెద్దవూర పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.
News November 1, 2025
అమెరికాలో ఉగ్రదాడులకు కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్బీఐ

అమెరికాలో ఉగ్ర దాడుల కుట్రను భగ్నం చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. మిషిగన్లో హాలోవీన్ వీకెండ్లో హింసాత్మక దాడులకు ప్లాన్ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. FBI ఏజెంట్లు, అధికారులు దేశాన్ని రక్షిస్తున్నారని అభినందించారు. అంతకుముందు మిషిగన్లో FBI సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు డియర్బర్న్ పోలీసులు వెల్లడించారు.
News November 1, 2025
RGM: అధికారులకు విజిలెన్స్ విధానం పై అవగాహన

రామగుండం సింగరేణి సంస్థ GM కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్ కిషోర్ బగాడియా పాల్గొని ‘విజిలెన్స్- మన భాగస్వామ్య బాధ్యత’ అనే అంశంపై వివరించారు. మనకున్న వనరులను ఉపయోగించి అభివృద్ధి సాధించడం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం సింగరేణి సంస్థ RG-1, 2, 3, ALP, భూపాలపల్లి ఏరియాల నుంచి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


