News March 15, 2025
గుర్రంపూడ్: గ్రూప్-3లో మెరిసిన కానిస్టేబుల్

గుర్రంపూడ్ మండలం కొప్పోల్ గ్రామానికి శంకర్ గ్రూప్ -3లో మెరిశాడు. శంకర్ ప్రస్తుతం సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ.. కష్టపడి చదివి గ్రూపు-3 కి ఎంపికయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూపు-2 ఫలితాలలో 674వ ర్యాంక్, గ్రూప్ -3 ఫలితాలలో 165వ ర్యాంకు సాధించాడు. దీంతో శంకర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి
Similar News
News February 11, 2026
నల్గొండ: ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్: కలెక్టర్

కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను తనిఖీ చేస్తున్నారు. పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల, బోయవాడలోని మోడల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే 18004251442 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
News February 11, 2026
నల్గొండ: ఇవాళ సెలవు

నల్గొండతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల పరిధిలోని అన్ని బ్యాంకులకు బుధవారం సెలవు ప్రకటించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ తెలిపారు. గురువారం యథా విధిగా బ్యాంకులు పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఫిబ్రవరి 11న ప్రత్యేక సాధారణ సెలవు దినాన్ని వినియోగించుకుని తమ ఓటు వేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు.
News February 11, 2026
నల్గొండలో మరి కాసేపట్లో పోలింగ్

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, చండూరు,హాలియా, దేవరకొండ, నందికొండ,చిట్యాల పురపాలికల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 162 వార్డుల పరిధిలో 475 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 3,09,097 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


