News February 25, 2025
గుర్రంపోడు తహశీల్దార్ సస్పెండ్

విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసినందుకుగాను సెలవులో ఉన్న గుర్రంపోడు తహశీల్దార్ జి.కిరణ్ కుమార్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు గత నెల 6 నుంచి 16 వరకు కలెక్టర్ సెలవులు మంజూరు చేశారు. గడువు దాటినా విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేశారు.
Similar News
News February 26, 2025
10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.
News February 26, 2025
NLG: 600 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

WGL- KMM – NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పిరియడ్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించొద్దని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు టీఎస్ఎస్పీ సిబ్బందితో పాటు దాదాపు 600 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
News February 26, 2025
నల్గొండ: 3 లక్షల మంది ఎదురుచూపు!

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం దశలవారీగా 2,76 ,694 మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసింది. 3 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించింది. రైతు భరోసాను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని రైతులంటున్నారు. ఎన్ని ఎకరాల వరకు అందిస్తుందో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో మరో 3 లక్షల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.