News October 24, 2024

గుర్ల ఘటనపై హోంమంత్రి ప్రెస్‌మీట్

image

విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, హోంమంత్రి అనిత గుర్ల గ్రామంలో గురువారం పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గుర్లలో డయేరియా కేసులు నమోదైన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. ఒకరు మాత్రమే డయేరియాతో మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని ఆమె పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామంలో పర్యటించి.. వాటర్ టెస్ట్ చేయించారని అన్నారు.

Similar News

News October 30, 2025

డెంకాడ: నేలకొరిగిన వరి పంట పరిశీలించిన ఉన్నతాధికారులు

image

డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామపంచాయతీ పరిధిలోని మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి పంటను జిల్లా వ్యవసాయ అధికారి వీ.టి. రామారావు గురువారం పరిశీలించారు. ఎంత మేర నష్టం కలిగిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు నష్టపోయిన వరి పంట ఎకరాకు రూ. 10,000ల చొప్పున నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని రైతులకు భరోసా కల్పించారు.

News October 30, 2025

ప్రతి నష్టాన్ని అంచనా వేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని జలాశయాల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను పర్యవేక్షిస్తూ ఎక్కడా నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. తుఫాన్, వరద పరిస్థితులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి నష్టాన్ని నమోదు చేసి, అంచనా వేయాలని ఆదేశించారు. నివేదికలు సాయంత్రానికి అందజేయాలన్నారు.

News October 30, 2025

VZM: వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

image

TTDలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో మాజీ TTD ఛైర్మన్ YV.సుబ్బారెడ్డి మాజీ PA అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపై సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో VZM (D) తెర్లాం (M)కి చెందిన అప్పన్నను అరెస్ట్ చేశారు.